- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా నా కెరీర్‌పై చాలా ప్రభావం చూపింది.. ఇకపై అలాంటి తప్పు చేయనంటూ శ్రీలీల షాకింగ్ కామెంట్స్
క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) ‘మాస్ జాతర’తో సినీ ప్రియలును అలరిస్తోంది. అప్పుడే మరో సినిమాను లైన్‌లో పెట్టేసింది.

దిశ, సినిమా: క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) ‘మాస్ జాతర’తో సినీ ప్రియలును అలరిస్తోంది. అప్పుడే మరో సినిమాను లైన్‌లో పెట్టేసింది. ప్రస్తుతం ఈ భామ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది. వరుస చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల ‘పుష్ప-2’(pushpa-2)లో ఐటమ్ సాంగ్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘పుష్ప సినిమా నా కెరీర్‌పై ప్రభావం చూపింది. అలాంటి పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం నాకు గర్వకారణం. కానీ ఇలాంటి ఐటమ్ సాంగ్స్ వేరే సినిమాల్లో మాత్రం చేయను. ఇకపై ఐటమ్ సాంగ్ చేసి తప్పు చేయాలనుకోవడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన చిత్రంలో నేను భాగం అవ్వడం నాకు గర్వంగా అనిపించింది. ఇండస్ట్రీలో నన్ను చాలామంది బెస్ట్ డ్యాన్సర్‌గా మాత్రమే చూస్తున్నారు. కానీ నేను కేవలం డ్యాన్సర్ కాదు, మంచి నటిని కూడా అని గుర్తించడం లేదు. నా పర్ఫామెన్స్ అందరికీ తెలిసినప్పటికీ డ్యాన్సర్‌గానే చూస్తున్నారు. అలాంటి ఆలోచనలు మార్చడం అంత తేలిక కాదు.. ఎవరి అభిప్రాయం వారిది. నా పని మాత్రం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం. అందుకే ప్రతి సినిమాలో కొత్తగా ఏదైనా చూపించాలని ప్రయత్నిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఐటమ్ సాంగ్స్ చేయడం అంత పెద్ద తప్పేమి కాదు.. ఫేమ్ పెరుగుతుందని సలహాలు ఇస్తున్నారు.






