- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయిన క్షణం అదే.. శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభ ఎంపీగా నేడు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభ ఎంపీగా నేడు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. కమల్‌తో పాటు తమిళనాడు నుంచి మరో ఐదుగురు డీఎంకే పి విల్సన్, సల్మా, ఎస్ ఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ విషయంపై శృతి హాసన్ (Shruti Haasan)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘నా ప్రియమైన అప్పా.. ఈ రోజు మీరు ధైర్యవంతమైన కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న ప్రయాణాన్ని సూచిస్తుంది. రాజ్యసభలో మీ సంతకం గొంతు బలం, గురుత్వాకర్షణతో ప్రతిధ్వనిస్తూ మీరు ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూడటం నా మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయిన క్షణం.
ఎప్పటిలాగే మీరు సంతోషంగా ఉండాలని, ఆశించే వన్నీ సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని రాసుకొచ్చింది. అలాగే తండ్రితో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కమల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘కూలీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర, నాగార్జున, సాబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు-14 థియేటర్స్‌లోకి రాబోతుంది.






