Super Star Krishna: కృష్ణ చనిపోవడానికి కారణం అదే..

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-15 04:58:41  IST  )

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామువ 4 గంటల 9 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Super Star Krishna: కృష్ణ చనిపోవడానికి కారణం అదే..
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామువ 4 గంటల 9 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారన్నారు. ఎమర్జన్సీ వైద్యం నిమిత్తం సీపీఆర్ చేశామన్నారు. రెండు మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయని తెలిపారు. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం ఏర్పడంతో అది కూడా చేశాం. సోమవారం సాయంత్రానికి కృష్ణ ఆరోగ్యం విషమించిందని పేర్కొన్నారు. చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్య బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.

ఇవి కూడా చదవండి:

రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..

Next Story