- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సంఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
తమిళనాడు (Tamil Nadu)కరూర్(Karur)లో శనివారం తమిళ హీరో విజయ్ పార్టీ తరఫున నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తమిళనాడు (Tamil Nadu)కరూర్(Karur)లో శనివారం తమిళ హీరో విజయ్ పార్టీ తరఫున నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో కొందరు చనిపోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. ఈక్రమంలో.. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ తొక్కిసలాట గురించి స్పందిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ‘‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట చాలా విషాదకరం, ఈ దుర్ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’ అని రాసుకొచ్చారు.






