- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ డైరెక్టర్ తన ముందే బట్టలు మార్చుకోమన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్నేషనల్ కామెంట్స్
నువ్వు బికినీలో ఎలా ఉంటావో, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నా ముందే వేసుకుని చూపించు’ అని అడిగారు

దిశ, సినిమా: ‘ఆలస్యం అమృతం’తో వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత హిందీ టీవీ రంగంలో ‘అనుపమ’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి మదాలస శర్మ.ఈ అమ్మడు తెలుగులో పాటు పలు భాషల్లోనటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘ది బెంగాల్ ఫైల్స్’మూవీతో అలరించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని, కాస్టింగ్ కౌచ్ సంఘటనను బయటపెట్టి సినీ వర్గాల్లో చర్చకు తెరలేపారు. 'ది మేల్ ఫెమినిస్ట్' అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, ముంబైలో ఒక ప్రముఖ దర్శకుడు తనను ఎలా ఇబ్బంది పెట్టారో వివరించారు. "అప్పుడు నా వయసు కేవలం 19 ఏళ్లు. ఒక పేరున్న దర్శకుడు సినిమా విషయమై నన్ను మీటింగ్‌కు పిలిచారు. కథలో భాగంగా బికినీ ధరించే అమ్మాయి కావాలని ఆయన అడిగారు. వృత్తిరీత్యా నటిని కాబట్టి, కథలో అవసరమైతే బికినీ వేసుకోవడం పెద్ద విషయం కాదని నేను భావించి సరే అన్నాను.
కానీ, ఆ దర్శకుడు మరో అడుగు ముందుకేసి.. ‘నువ్వు బికినీలో ఎలా ఉంటావో, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నా ముందే వేసుకుని చూపించు’ అని అడిగారు." అని చెప్పుకొచ్చారు. దర్శకుడు అలా అడగగానే మదాలస ఏమాత్రం భయపడకుండా చాలా తెలివిగా, ధైర్యంగా స్పందించారట. "నేను నటిని. కెమెరా ముందు కథకు అవసరమైతే బికినీ అయినా, చీర అయినా ధరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది నా వృత్తిలో భాగం. కానీ, మీ ముందు బట్టలు మార్చుకుని బికినీ వేసుకోవడం నా ఉద్యోగం కాదు. నా టాలెంట్ నచ్చితే తీసుకోండి, లేదంటే నేను వెళ్ళిపోతాను" అని ముఖం మీదే చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశా అని చెప్పింది..
ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మదాలసకు ఒక షాకింగ్ విషయం తెలిసిందట. ఆ సినిమా కాస్టింగ్ గురించి ఒక రిపోర్ట్ చదవగా, ఆ పాత్రకు ఎంపికైన నటి సదరు దర్శకుడితో డేటింగ్‌లో ఉందని ఆమెకు అర్థమైందని తెలిపింది. అంటే ఆ దర్శకుడు కావాలనే తనను వేధించడానికి ప్రయత్నించారని ఆమె గ్రహించినట్లు వివరించింది. ప్రస్తుతం మదాలస చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతటి వారైనా సరే, తప్పుడు కోరికలు కోరితే ఎలా బుద్ధి చెప్పాలో మదాలస నిరూపించారని నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ప్రస్తుతం మదాలస ‘అనుపమ’ వంటి హిట్ షోలతో బిజీగా ఉండటమే కాకుండా, విభిన్న భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.






