ఆ సంస్థకే ‘లోకా’ థియేట్రికల్ రైట్స్.. మరపురాని సినిమాటిక్ రైడ్‌కి సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-15 13:36:18  IST  )

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సంస్థకే ‘లోకా’ థియేట్రికల్ రైట్స్.. మరపురాని సినిమాటిక్ రైడ్‌కి సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ భాషలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం విభిన్న కథలను ఎంచుకుంటూ అచీ తూచీ అడుగులు వేస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా: చాప్టర్ వన్ చంద్రా’(Loka: Chapter One Chandra) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నస్లెన్, సాండి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీని దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) వేఫరర్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

డొమినిక్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఓనమ్ పండుగ కానుకగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అప్పుడే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రం హక్కులను ags cinimas సొంతం చేసుకోగా ఈ విషయాన్ని తెలుపుతూ.. మరపురాని సినిమాటిక్ రైడ్ కి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.

Next Story