Salaar 2 : సలార్ 2 లో ఆ బాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

by Dishafeatures1 |
Salaar 2 : సలార్ 2 లో ఆ బాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?
X

దిశ,సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‌‌‌‌‌‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే డార్లింగ్ గత ఎడాది సలార్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సీక్వెన్స్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్ పార్ట్-2లో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. రెండో పార్ట్ లో ఆమె ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అది కూడా సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తుందని సమాచారం. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారా తో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుందని డార్లింగ్ అభిమానులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Next Story

Most Viewed