ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ కొత్త స్కెచ్.. ఏకంగా డొనాల్డ్ ట్రంప్‌కే షాకిచ్చాడుగా?

by Mallepaka Hamsa |

ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ ఏకంగా ఏఐని రంగంలోకి దించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు.

ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ కొత్త స్కెచ్.. ఏకంగా డొనాల్డ్ ట్రంప్‌కే షాకిచ్చాడుగా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేయడానికి తరుణ్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. అయితే, ఆ పరాజయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ అనే సరికొత్త ప్రయోగంతో మన ముందుకు రాబోతున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 1, 2026న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అమెరికన్ డ్రీమ్‌తో అక్కడికి వెళ్లిన ఒక యువకుడికి, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న డిపోర్టేషన్ నిర్ణయం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అనే అంశాన్ని డార్క్ కామెడీ ,సెటైరికల్ వేలో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ ఏకంగా ఏఐని రంగంలోకి దించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ‘ఇండియన్ టీ వెరీ నైస్’ అని ప్రశంసిస్తారు. దానికి తరుణ్ స్పందిస్తూ.. "ఇండియన్ టీ ఎప్పుడూ బాగుంటుంది.. కానీ నేను మీకిచ్చింది ఇరాన్ టీ" అని పంచ్ ఇస్తారు.దాంతో ట్రంప్ షాక్ అవ్వడం చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో చివర్లో ఎస్వీసీ ప్రత్యంగిరా సినిమాస్ వారు ఒక వెరైటీ ప్రకటన చేశారు.. "ఈ సినిమాను ఇరాన్‌లో తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా రిలీజ్ చేస్తున్నాం" అని చెప్పడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కశ్యప్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్ , తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కానున్నాయి.

Next Story