దేవుడా ఏంటీ పరీక్ష..? 'థాంక్ గాడ్'కు ట్రబుల్స్ తప్పవా?

by Disha Web Desk 22 |
దేవుడా ఏంటీ పరీక్ష..? థాంక్ గాడ్కు ట్రబుల్స్ తప్పవా?
X

దిశ, సినిమా : అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్స్‌ ప్లే చేస్తున్న 'థాంక్ గాడ్' లీగల్ ట్రబుల్స్‌లో పడింది. ఈ ఏడాది బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ఈ సినిమా ట్రైలర్.. కామెడీ టైమింగ్‌తో మాసివ్ బజ్ క్రియేట్ చేసింది. కానీ ఇందులోని కొన్ని సీన్స్, డైలాగ్స్ రిలీజియస్ సెంటిమెంట్స్‌ను హర్ట్ చేస్తున్నాయని జౌన్‌పూర్ కోర్టులో కేసు వేశాడు లాయర్ హిమాన్షు శ్రీవాత్సవ. ఈ సినిమాలో చిత్రగుప్తుడిగా కనిపించిన అజయ్.. సూట్ ధరించడమే కాక అసభ్యకరమైన పదజాలంతో జోక్స్ పేల్చడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. మనుషులు చేసే మంచి-చెడులను లెక్కిస్తూ.. కర్మకు ప్రభువుగా కొలవబడే చిత్రగుప్తుడిని తక్కువగా చేసి చూపించడం అసహ్యకరంగా ఉందన్నాడు. కాగా కోర్టు నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపింది. కానీ అంతకు ముందే అక్టోబర్ 25న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో మూవీ పోస్ట్‌పోన్ అవుతుందా లేక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.


Next Story

Most Viewed