- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తమ్ముడు’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్
యంగ్ హీరో నితిన్(Nithin) రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’(Robbin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్(Nithin) రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’(Robbin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) కీ రోల్ ప్లే చేశాడు. అయితే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఓకే ఓకే అనిపించుకుంది. ఇక ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu). శ్రీరామ్ వేణు(Sri Ram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమ్ముడు మూవీని జులై 4న రిలీజ్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.






