నితిన్ ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కళ్యాణ్ టైటిల్‌తో వచ్చేసిన “తమ్ముడు”

by Disha Web Desk 8 |
నితిన్ ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కళ్యాణ్ టైటిల్‌తో వచ్చేసిన “తమ్ముడు”
X

దిశ, సినిమా : హీరో నితిన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా తమ్ముడు. ఎక్స్‌ట్రా ఆర్ఢినరీ మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. దీంతో నితిన్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ పేరు తమ్ముడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేసి షూటింగ్ మొదలు పెట్టారు.

తాజాగా నితిన్ పుట్టిన రోజు సందర్భంగా,పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒక్కటైన తమ్ముడు టైటిల్‌తో ఉన్న సినిమా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీ తోలుతుంటే నితిన్ లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని కూర్చున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కాగా, ఈ మూవీని దిల్ రాజ్ తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. అలాగే కాంతార సినిమాకు సంగీతం సమకూర్చిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ వైజాగ్‌లో జరిగినట్లు సమాచారం. కాగా, ఫస్ట్ లుక్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More..

Hero Nithin: నేడు హీరో నితిన్ పుట్టినరోజు


Next Story