రాత్రి 8 గంటల తర్వాత ఆ పని చేయను అంటున్న తమన్నా! కండీషన్ మాములుగా లేదుగా

by Kavitha |
రాత్రి 8 గంటల తర్వాత ఆ పని చేయను అంటున్న తమన్నా! కండీషన్ మాములుగా లేదుగా
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామకు ఇప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇక ఆమె ఏజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. బాహుబలి తరువాత తమన్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ సినిమా తర్వాత పైగా మరింత కిందకి వెళ్లి నట్టుగా అనిపించింది. తమన్నాకు ఇంత వరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదనే చెప్పాలి. స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీతో కలిసి తమన్నా నటించింది.

తన అందం, పర్సనల్ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తమిళంలో నటించిన "అరుణ్మనై 4" అనే సినిమా విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాదు ఐటెం సాంగ్స్ లోనూ డాన్స్ చేసి అదరగొడుతుంది ఈ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తనకు ఉన్న వింత అలవాటు గురించి వెల్లడించింది. తను ఎప్పుడైనా దేనికైనా సిద్ధంగా ఉంటానని అందరికీ చెప్తాను కానీ అది నిజం కాదు నాకు రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడికి వెళ్లడం లేదా ఏదైనా పని చేయడం అంటే ఇష్టం ఉండదు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత పనులు చేయడం మంచిది కాదు అంటూ తమన్నా తనకున్న వింత అలవాటును బయట పెట్టారు. దీంతో ఆమె అభిమానులు డే మొత్తం షూటింగ్స్, వర్కౌట్స్‌తో బిజీగా ఉండే ఈ భామ ఎనిమిది దాటాక అయినా రెస్ట్ తీసుకోవాలి అని పెట్టుకున్న రూల్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.

Next Story

Most Viewed