అఖండ గా మారిన థమన్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

by Web Desk |
అఖండ గా మారిన థమన్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
X

దిశ,సినిమా: బోయపాటి శ్రీను- బాలయ్య కలయికలో వచ్చిన మూడో చిత్రం 'అఖండ'. ఈ మూవీలో అఘోరాగా కనిపించిన బాలయ్య అభిమానులను ఉర్రుతలూగించారు. అంతేకాదు తన అసాధారణ నటనతో కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రాణం పోశాడనే చెప్పవచ్చు. అయితే ఈ మూవీకి థమన్ అందించిన సంగీతం మరో లెవెల్. కాగా బాలయ్య ఫ్యాన్స్ అఖండ నేపథ్య సంగీతాన్ని తీసుకుని అదిరిపోయే మీమ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'భం.. అఖండ' అంటూ బాలయ్య బాడీకి థమన్ ఫేస్ యాడ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ మేరకు వీడియో పై స్పందించిన థమన్.. 'బ్రో నా టీషర్టు లో తల పెట్టుకుని దీన్ని చూశాను. వామ్మో చాలా బలం కావాలి. మీ టాలెంట్ కి ఫిదా అయ్యాను' అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

https://twitter.com/AjayCrush1/status/1485232340855291907?s=20



Next Story