పెళ్లిపై దారుణ ట్రోల్స్.. చాలా సంతోషంగా ఉందంటూ అవికా గోర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:36:03  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అవికా గోర్ (Avika Gore)బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పెళ్లిపై దారుణ ట్రోల్స్.. చాలా సంతోషంగా ఉందంటూ అవికా గోర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అవికా గోర్ (Avika Gore)బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా మిలింద్ చద్వానీతో ప్రేమలో ఉన్న ఈ భామ ఇటీవల ఓ రియాలిటీ షోలో బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు ఈవెంట్స్‌లోనూ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పెళ్లి తర్వాత ఓ సినిమాను కూడా ప్రకటించిన ఈ భామ నిత్యం పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ బిజీ అయిపోయింది. గత కొద్ది రోజులుగా.. అవికా గోర్ పెళ్లిపై పలు విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా విమర్శలపై స్పందించింది. ‘‘టీవీ షోలో పెళ్లి చేసుకుందామని మిలింద్‌(Milind Chadwani)కు చెప్పినప్పుడు తను అంగీకరించాడు.

కానీ ప్రజలు విమర్శిస్తారని ముందే చెప్పాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని అంటారని అన్నాడు. నా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. మిలింగ్ ఒప్పుకోవడం నాకు ముఖ్యం కానీ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నా పెళ్లి సంప్రదాయంగా జరిగింది. అందుకే నా వెడ్డింగ్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ట్రోల్స్ నా భర్తపై వస్తే నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే.. ఆయన లుక్‌ను నేను డిజైన్ చేశాను. అలా రానందుకు సంతోషంగా ఉంది. అలాగే నా లుక్‌పై ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నేను ధరించిన బట్టలు నాకు నచ్చితే చాలు.. మీ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చింది. అలాగే అవికా గోర్, మిలింగ్ ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం వారు ఓ ఈవెంట్‌లో చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. అవికాకు పిల్లలు పుట్టరా అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని ఆశ్చర్యపోతున్నారు.

READ MORE ....

పెళ్లికి ముందు సెక్స్.. భర్తతో కాకుండా మరొకరితో శృంగారం.. దీపిక సంచలన కామెంట్స్..

Next Story