- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ ధరకు ‘కాంతార చాప్టర్-1’ థియేట్రికల్ రైట్స్.. రిస్క్ తీసుకుంటున్నారా?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన స్వయం దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1) రాబోతుంది. ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్-2 థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను చిత్రబృందం ఏకంగా రూ. 100 కోట్లకు అమ్మాలనే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు అసలు కొనేందుకు ఎవరైనా వస్తారా.. మూవీ మేకర్స్ రిస్క్ తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు.






