- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రదేశాన్ని తెలుగు వాళ్ళు నాశనం చేస్తున్నారు.. శివాజీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు
టాలీవుడ్ నటులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల రాజమౌళి హనుమాన్‌పై చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. అలాగే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ భక్తులు ఆయనపై విమర్శలు చేశారు. అంతేకాకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగా.. మరో నటుడు తెలుగు వారి వల్లే ఓ పవిత్ర ప్రదేశం నాశనం అవుతుందని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
అసలు విషయంలోకి వెళితే.. నటుడు శివాజీరాజా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ తన నటనతో అందరినీ కన్నీరు పెట్టుకునేలా చేస్తున్నారు. ఇటీవల ఓ విలేజీ ప్రేమ కథగా తీసిన ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ చిత్రంలో హీరోగా తండ్రిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ రాజా అరుణాచలం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మేము అరుణాచలంకు గత 30 ఏళ్లుగా వెళ్తూనే ఉన్నాం. నాకు అక్కడ భూమి కూడా ఉంది. ఇల్లు కట్టాలని అనుకున్నా సాధ్యపడలేదు. నేను, మా మిసెస్, మా వాళ్లు వెళ్లితే ఎలాంటి హంగులు లేకుండా దండం పెట్టుకుని రావడం మా అలవాటు.
నేను, రాజా రవీంద్ర కూడా అక్కడికి రెగ్యులర్‌గా వెళ్తాం. ఈ మధ్య చాలా మంది అరుణాచలం ను ఒక టూరిస్ట్ ప్లేస్‌లా చూస్తున్నారు. “ఒక్కసారి వెళ్లి చూద్దాం”, “వెకేషన్ ట్రిప్ లా చేద్దాం” అంటూ ఆసక్తితో వెళ్లేవాళ్లు పెరుగుతున్నారు.కానీ వాళ్లు వెళ్లిన తర్వాత అక్కడి వాతావరణం మెల్లగా మారిపోతుంది. రమణాశ్రమం అసలు చాలా సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. వెంకటేష్, ఇళయరాజా వంటి వారు కూడా అక్కడికి ప్రశాంతంగా ఉండటం కోసం వచ్చి వెళ్లిపోతారు. కానీ కొందరు ఫొటోలు కోసం అరిచేసి ఆ ప్రశాంతాన్ని నాశనం చేస్తున్నారు. ఒకసారి ఫారెనర్స్ కూడా వచ్చి మన వాళ్లకు సైలెన్స్ పాటించమని చెప్పాల్సి వచ్చింది. భక్తితో వెళ్లేవాళ్లు చాలా మంది ఉన్నా, అలజడి చేసే 25 శాతం మంది వల్ల ప్రదేశం అసలు పుణ్యభూమి అన్న గౌరవం తగ్గిపోతుంది. పూజలు చేసుకోవడం తప్పు కాదు కానీ అతిగా చేసి అల్లరి చేయడం మాత్రం అక్కడి పవిత్రతను దెబ్బతీస్తోంది. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరిని తప్పు పట్టాలని కాదు’’ అని అన్నారు. ప్రజెంట్ ఈ కామెంట్స్‌పై కొందరు నెటిజన్లు తెలుగవాడివి అయి ఉంటి ఇలా అనడం కరెక్ట్ కాదని విమర్శలు చేస్తున్నారు.






