తెలుగు హీరోలు ప్రీ-రిలీజ్ ఈవెంట్లతో జనాలను విసిగిస్తున్నారు.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్

by Mallepaka Hamsa |

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా సినిమా ప్రమోషన్లు చేస్తూ మూవీ మేకర్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు.

తెలుగు హీరోలు ప్రీ-రిలీజ్ ఈవెంట్లతో జనాలను విసిగిస్తున్నారు.. దుమారం రేపుతున్న నటుడి కామెంట్స్
X

దిశ, సినిమా: పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా.. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలను కూడా భారీ ఎత్తున ప్రమోట్ చేస్తూ మూవీ మేకర్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు. ప్రమోషన్లలో భాగంగా అప్డేట్స్‌తో పాటుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఆడియో వేడుకలుగా ఉండగా.. ఇప్పుడు పేరు మార్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నప్పటికీ ఈవెంట్ జరిగే తీరు మాత్రం మారలేదు. సాయంత్రం మొదలు పెట్టి లేట్ నైట్ వరకు నిర్వహించి స్పీచ్‌లతో అభిమానులను సంతోష పెడతారు.ఇక ఏదైనా సినిమా ఈవెంట్ అనగానే జనాలు భారీగా తరలివెళ్తుంటారు. ఇలాంటి వేడుకల్లో ఒక్కోసారి ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అత్యధిక జనం వల్ల తొక్కిసలాటలు కూడా జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు(Ravi Babu) ప్రీ రిలీజ్ వేడుకలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పద్ధతి అనవసరం అనిపిస్తుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఒకరినొకరు పొగుడుకోవడం.. అక్కడున్న జనం అవసరం లేకపోయినా అరవడం.. ఒక్కొక్కరి గురించి ఏవీలు వేసి ఎలివేషన్లు ఇవ్వడమే ఉంటుంది. స్టేజ్ మీదికి వచ్చే వాళ్లకు ఏం చేయాలో కూడా తెలియకపోవడం.. వారిని యాంకర్లు గైడ్ చేయడం వంటివి జరుగుతుంటాయి. ఇలా మొత్తంగా ఈ ఈవెంట్లు విపరీతమైన అసహనాన్ని కలిగించేలా సాగుతున్నాయి. హాలీవుడ్‌లో ఎప్పుడూనా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి ఈవెంట్లు జరగడం చూశారా? వాళ్లు మన హీరోల కంటే పెద్ద స్టార్స్.. కానీ వాళ్లు టీవీ షోలకు వచ్చి సింపుల్‌గా సినిమాల ప్రమోషన్ చేస్తారు. కానీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ల పెట్టి జనాలను విసిగించరు. కానీ తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతాయి’’ అని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రవిబాబు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయిఈ కామెంట్స్ తెలుసుకున్న వారంతా మన ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ స్టా్ర్ హీరోల గురించి ఇలా మాట్లాడటం ఏంటని ఫైర్ అవుతున్నారు.

Next Story