సంచలన ప్రకటన చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆదేశాలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-08 13:23:05  IST  )

సినీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మే నిర్వహించిన విషయం తెలిసిందే.

సంచలన ప్రకటన చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆదేశాలు
X

దిశ, సినిమా: సినీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మే నిర్వహించిన విషయం తెలిసిందే. నిర్మాతలు వేతనాలు 30 శాతం పెంచి ఇవ్వాలని అలా అయితేనే సమ్మే విరమించుకుంటామని పట్టుబట్టుకుని కూర్చున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఏ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాతలకు ఆదేశాలు జారీ చెస్తూ హెచ్చరిక చేసింది. ‘‘స్టూడియోలు, ఓట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి మందస్తు సమాచారం, స్పష్టమైన అనుమతి లేకుండా ఎలాంటి సేవలను అందించకూడదు. నిర్మాతలు ఈ ఆదేశాలు సీరియస్‌గా తీసుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చర్చలు, సంప్రదించులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని కోరుతున్నాము. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లోనే ఉంటాయి’’ అని తెలిపారు. కాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలన్ని షూటింగ్ దశలో ఉండగా.. ఇలాంటి సమయంలో ఈ ప్రకటన వచ్చింది. విడుదల తేదీలు ప్రకటించిన భారీ ప్రాజెక్ట్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ నిర్ణయం వల్ల షూటింగ్ వాయిదా పడటంతో పాటు విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.

Next Story