- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడాకుల బాటలో బుల్లితెర జంట.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో..
బుల్లితెర కపుల్ అయినటువంటి అమర్(Amar), తేజస్విని(Tejaswini) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర కపుల్ అయినటువంటి అమర్(Amar), తేజస్విని(Tejaswini) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ సీరియల్ జంట ఎంతో మందికి ఆదర్శం. అబ్బా.. చూడముచ్చటైన జంట.. మొగుడు పెళ్లాలు అంటే ఇలా ఉండాలి అని అనిపించే కపుల్ వీరు. ముఖ్యంగా అమర్ దీప్ బిగ్‌బాస్(Big Boss) హౌస్‌లో ఉన్నప్పుడు తేజస్విని పెద్ద యుద్దమే చేసింది. భర్తకు అండగా నిలిచి హౌస్‌లో అమర్ ఆడుతుంటే బయట ట్రోలింగ్‌ని తట్టుకుని నిలబడింది. భర్తకు తగ్గ భార్య అనిపించుకుంది. ఇలాంటి అన్యోన్యమైన జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన తేజస్విని తమ డివోర్స్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘ విడాకులు తీసుకుంటున్నామంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం. భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. అంతమాత్రాన ఎవరూ విడిపోరు. అలాగే అమర్ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.. నా కన్నా తనే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. మేం ఇద్దరం హాయిగా సంతోషంగా ఉన్నాం ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలోనూ ఇలాంటి రూమర్స్ పై అమర్ దీప్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి






