- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన 8 ఏళ్లకు తల్లిదండ్రులైన బుల్లితెర జంట.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బుల్లితెర జంట మెరీనా అబ్రహం సాహ్ని(Marina Abraham Sawhney), రోహిత్(Rohit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బుల్లితెర జంట మెరీనా అబ్రహం సాహ్ని(Marina Abraham Sawhney), రోహిత్(Rohit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు పలు సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కొద్ది కాలంపాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పలు సిరీయల్స్, షోస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా మెరీనా, రోహిత్ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో జంటగా ఇంట్లోకి వెళ్లారు. అయితే మెరీనా మధ్యలోనే బయటకు రాగా.. రోహిత్ మాత్రం అన్ని టాస్కులు బాగా ఆడి టాప్ 5 స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక మాత్రం ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక ఈ జంట పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..మెరీనా 2021లో తొలిసారి ప్రెగ్నెంట్ అయింది. కానీ హాట్‌బీట్ రాకపోవడంతో తీసేయించుకుంది.
ఆ తర్వాత 2022లోనూ మరోసారి గర్భం దాల్చింది. అది కూడా మిస్‌క్యారేజ్ అయింది. ఇక ఇటీవల మూడో సారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిందిం. అలాగే నిత్యం బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. తాజాగా, మెరీనా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. డెలివరీ అయి చాలా రోజులే అవుతున్నప్పటికీ నేడు కృష్ణాష్టమి కావడంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన బిడ్డకు నామకరణం చేసినట్లు తెలిపింది. పాపకు ‘తెయారా సాహ్ని’(Teiara Sahni ) అని పేరు పెట్టినట్లు తెలుపుతూ బుజ్జి పాపాయి చేతులు, కాళ్లు, కనిపించే ఫొటోలను షేర్ చేస్తూ ‘‘ఈ శుభ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాకు కూతురు పుట్టిందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి’’ అని రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లైన 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడంతో ఈ జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






