దీపిక సెక్స్ సినిమాలు చేసినా నో ప్రాబ్లమ్.. నేను అలా కనిపిస్తేనే ..

by Disha Web Desk 2 |
దీపిక సెక్స్ సినిమాలు చేసినా నో ప్రాబ్లమ్.. నేను అలా కనిపిస్తేనే ..
X

దిశ, సినిమా : నటి తేజస్విని పండిట్ ఇటీవల వచ్చిన డిజిటల్ సిరీస్ 'రాన్‌ బాజార్‌'లో వేశ్యగా నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో తన బోల్డ్ లుక్స్‌పై లింగవివక్షతో కూడిన ప్రశ్నలు ఎదురైనట్లు తెలిపింది. అయితే వాటన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానం చెప్పినప్పటికీ.. కొందరు అడిగే విధానం చిరాకు తెప్పించిందంటోంది. ఇక దీని గురించి అంతలా మాట్లాడుతున్న వాళ్ల సమస్య ఏంటో తనకు అర్థం కాలేదన్న నటి.. మరాఠీ ప్రేక్షకులు తమ పరిశ్రమకు చెందిన మహిళలు న్యూడ్ పాత్రలో కనిపిస్తే బాధపడతారని కొంతకాలానికి తెలుసుకున్నట్లు చెప్పింది. అందుకే దీపికా పదుకొణె లాంటి స్టార్ యాక్ట్రెస్ బట్టలు విప్పేసినా పట్టించుకోరేమో కానీ.. కుటుంబ సభ్యులుగా భావించిన తనలాంటి వాళ్లు చేస్తే మాత్రం మనస్తాపం చెందుతారని అభిప్రాయపడింది. మిగతా ఇండస్ట్రీల కన్నా మరాఠీ అభిమానుల హృదయాలను చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంది.


Next Story