Zombie Reddy 2: ల‌క్ అంటే సజ్జా తేజదే...ఏకంగా రూ.42 కోట్ల‌తో !

by velandi.Saikiran |   (  Updated:2025-10-21 07:23:16  IST  )

రూ.42 కోట్లకు డీల్ సెట్ అయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద హీరోల సినిమాలనే ఓటీటీ సంస్థలు

Zombie Reddy 2:  ల‌క్ అంటే సజ్జా తేజదే...ఏకంగా రూ.42 కోట్ల‌తో !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ కుర్రాడు సజ్జా తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సజ్జా తేజ, ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. జాంబిరెడ్డి, హనుమాన్, ఇటీవల మిరాయ్‌ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసేసాడు సజ్జా తేజ. మిరాయ్‌ సినిమా మొన్న రిలీజ్ అయి ప్రభంజనమే సృష్టించింది. ఊహించని దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. అయితే అలాంటి సజ్జా తేజకు బంపర్ ఆఫర్ తగిలింది. జాంబిరెడ్డి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సజ్జా తేజ, త్వరలోనే జాంబిరెడ్డి 2 తీయబోతున్నాడు.

అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ ఈ జాంబిరెడ్డి 2 సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ మాత్రం దాదాపుగా ఫినిష్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.42 కోట్లకు డీల్ సెట్ అయినట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద హీరోల సినిమాలనే ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే రూ.42 కోట్ల బిజినెస్ డీల్ జరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది. హనుమాన్ అలాగే మిరాయ్‌ సినిమాతో వరుసగా హిట్లు అందుకున్న నేపథ్యంలోనే సజ్జా తేజ సినిమాకు బ్రాండ్ వచ్చిందని అంటున్నారు.

READ MORE .....

మ‌హేష్‌-జ‌క్క‌న్న మూవీ నుంచి బిగ్ అప్డేట్‌..టైటిల్‌, గ్లింప్స్ లోడింగ్‌ !

Next Story