- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రైమ్ కామెడీ ‘కీడా కోలా’ను వెరైటీగా ప్రమోట్ చేస్తున్న తరుణ్ భాస్కర్
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’.

X
దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండగా విడుదల తేది దగ్గర పడుతుండటంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తెగ సందడి చేసిన మూవీ టీమ్ ఈ చిట్ చాట్‌కు సంబంధించిన సంభాషణల వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక వీజీ సైన్మా సంస్థ నిర్మించిన సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.
Next Story






