బ్రేకింగ్: విషమంగా Tarakaratna ఆరోగ్యం.. బెంగళూర్‌కు వెళ్లనున్న Jr. NTR

by Satheesh |   (  Updated:2023-01-29 11:25:25  IST  )

గుండె పోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బ్రేకింగ్: విషమంగా Tarakaratna ఆరోగ్యం.. బెంగళూర్‌కు వెళ్లనున్న Jr. NTR
X

దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారకరత్న గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్మో ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, తారకరత్న అరుదైన ''మెలెనా'' అనే వ్యాధితో బాధపడుతున్నాడని.. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతోందని వైద్యులు తెలిపారు. బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయిందని.. దీంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా తారకరత్నకు బ్లడ్ పంపింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తు్న్నామని తెలిపారు. కాగా, తారకరత్న హెల్త్ కండిషన్ వెరీ క్రిటికల్‌గా ఉండటంతో ఆయన సోదరుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి వెళ్లి తారకరత్నను పరామర్శించనున్నారు. కాగా, ఇప్పటికే తారకరత్న తండ్రి, భార్య అలేఖ్య రెడ్డి, బాలకృష్ణ, చంద్రబాబు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుప్రతిలోనే ఉన్నారు.

Also Read..

బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెడితే హోదా రాదు: Shruti Haasan

Next Story