Tarakaratna: టీడీపీ పార్టీ కోసం బరిలోకి దిగిన తారకరత్న.. కానీ అంతలోనే ఇలా అయిపొయింది!

by Disha Web Desk 10 |
Tarakaratna: టీడీపీ పార్టీ కోసం బరిలోకి  దిగిన  తారకరత్న.. కానీ అంతలోనే ఇలా  అయిపొయింది!
X

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి తారకరత్న మృతి పట్ల తెలుగు రాష్ట్ర ప్రజలు సంతాంపం తెలుపుతున్నారు. సినిమాల్లోకూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తారకరత్న పొలిటికల్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. దాని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని కసరత్తు మొదలుపెట్టాడు . వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బరి లోకి దిగాడు. టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో తారకరత్న చురుగ్గా పాల్గొన్నారు .

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని.. చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనడంతో సీటు కూడా కేటాయిస్తారని ప్రచారం జరిగింది. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తారకరత్న కోలుకుని మన ముందు తిరగాలని నందమూరి అభిమానులు కోరుకున్నారు. కానీ విధి రాతను ఎవరు తప్పించలేరు. తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు.

ఇవి కూడా చదవండి : Nandamuri Taraka Ratna చివరి వీడియో ఇదే..!

Next Story

Most Viewed