తారకరత్న ఆత్మబలంతో పోరాడుతున్నారు: Jr. NTR

by Satheesh |   (  Updated:2023-01-29 08:07:56  IST  )

త్వరలోనే తారకరత్న కోలుకుంటారని ఆయన సోదరుడు, స్టార్ హీరో ఎన్టీఆర్ ఆశా భావం వ్యక్తం చేశారు.

తారకరత్న ఆత్మబలంతో పోరాడుతున్నారు: Jr. NTR
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే తారకరత్న కోలుకుంటారని ఆయన సోదరుడు, స్టార్ హీరో ఎన్టీఆర్ ఆశా భావం వ్యక్తం చేశారు. గుండె పోటుకు గురై బెంగుళూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆదివారం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పరామర్శించారు. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందని.. ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నాడని తెలిపారు. ఆత్మబలంతో తారకరత్న పోరాడుతున్నారని అన్నారు. అన్న కోసం అభిమానులు అందరూ ప్రార్థనలు చేయాలని కోరారు. క్రిటికల్‌ స్టేజ్ నుండి తారకరత్న బయటకు పడ్డారని చెప్పలేమని.. ఇంకా స్టేబుల్‌గానే ఉన్నట్లు తారక్ పేర్కొన్నారు. కర్నాటక వైద్యశాఖమంత్రి మరో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించారని తెలిపారు.

Also Read..

బెంగళూర్ చేరుకున్న తారక్, కళ్యాణ్ రామ్.. వీడియో

Next Story