ఇండస్ట్రీలోకి Tarak తనయుడి ఎంట్రీ?.. ఏకంగా తండ్రి సినిమాతోనే

by Disha Web Desk 9 |
ఇండస్ట్రీలోకి Tarak తనయుడి ఎంట్రీ?.. ఏకంగా తండ్రి సినిమాతోనే
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో సినీ వారసుల హవా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇటీవల స్టార్ హీరోల పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగానే ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తున్నారు. రీసెంట్‌గా ‘శాకుంతలం’ మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంట్రీ ఇవ్వగా, ప్రజెంట్ మరో స్టార్ హీరో తనయుడు కూడా రెడీగా ఉన్నాడు. అతనెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు. ఇతను ఎంట్రీ ఇవ్వబోయేది ఏదో సినిమాలో కాదు తారక్ నటిస్తున్న మూవీనే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ అయితే కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఇందులో తారక్ కొడుకు నటిస్తున్నాడా? అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే ఎన్టీఆర్‌కి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిద్దరిలో ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో అతని చిన్న కొడుకు నటించబోతున్నాడట. దీనిగురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ, షోషల్ మీడియాలో మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి :

ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్‌ను ఏడుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

ఆ ఏజ్‌లో రెండో పెళ్లా?.. హీరోయిన్ స్ట్రాంగ్ ఆన్సర్‌తో రూమర్స్‌కు బ్రేక్

Next Story

Most Viewed