ఆ పని కోసం నెటిజన్ల సాయం కోరుతున్న హాట్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

by Web Desk |
ఆ పని కోసం నెటిజన్ల సాయం కోరుతున్న హాట్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మి- హాట్ బ్యూటీ తనుశ్రీ దత్తా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఆషిక్ బనాయా ఆప్నే'. ఈ సినిమా టైటిల్ సాంగ్‌లో అందాలు ఆరబోసిన తనుశ్రీ.. కుర్రాళ్లకు మత్తెక్కించిన సంగతి తెలిసిందే. ఇక 2004లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ.. మిస్ యూనివర్స్ పోటీల్లో‌నూ టాప్‌టెన్‌లో నిలిచింది. అయితే ఇన్ని అర్హతలున్నప్పటికీ తనను కేవలం 'ఇండియన్ మోడల్‌'గానే చూపిస్తోందంటూ వికీపీడియాపై అసహనం వ్యక్తంచేస్తూ పోస్ట్ పెట్టింది.

'హలో ఫ్రెండ్స్ నన్ను ఒక విషయం ఇబ్బంది పెడుతోంది. వికీపీడియా ప్రొఫైల్‌ నన్ను 'ఇండియన్ మోడల్'గా మాత్రమే చూపిస్తోంది. నేను మార్చడానికి ప్రయత్నించాను. కానీ మళ్లీ అలాగే వస్తోంది. ఎవరైనా సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం గూగుల్ రిజల్ట్స్ పరమ చెత్తగా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు సమాచారం ఎలా మార్చాలో తెలియట్లేదు. దయచేసి ఎవరైనా సహాయం చేయగలరు' అంటూ రాసుకొచ్చింది.

Next Story