Thalapathy Vijay : కారు అమ్ముకుంటున్న హీరో దళపతి విజయ్.. ఎంతకో తెలుసా?

by Ramesh Naini |

తమిళ స్టార్ దళపతి ఎంతో ఇష్టపడి కొనుకున్న కారును అమ్ముతున్నట్లు తెలిసింది.

Thalapathy Vijay : కారు అమ్ముకుంటున్న హీరో దళపతి విజయ్.. ఎంతకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ స్టార్ దళపతి ఎంతో ఇష్టపడి కొనుకున్న కారును అమ్ముతున్నట్లు తెలిసింది. 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును విదేశాల నుంచి తెప్పించుకున్న సమయంలో లోకల్ టాక్స్ కట్టలేదనే అరోపణలు విజయ్‌పై ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే ఆయనకు కోర్టు సైతం మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం విజయ్‌కు రూ. లక్ష జరిమానా విధించింది. అనంతరం 2021లో కారుకు సంబంధించి మొత్తం ట్యాక్స్‌ రూ.40 లక్షలు విజయ్‌ చెల్లించాడని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది.

విజయ్ ఇష్టంగా కొనుకున్న కారు విక్రయానికి వచ్చిందనే విషయం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. దళపతి ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చిందంటూ కారు ఫొటోను ఎంపైర్‌ ఆటోస్‌ కార్‌ డీలర్‌షిప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీని ధర రూ. 2.6 కోట్లు అని, ఇంకా ధర తగ్గించే ఛాన్స్ ఉందని సంస్థ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ కారు కొన్నప్పటినుంచి కోర్టు వివాదాలు, మరోవైపు తన రాజకీయ పార్టీ నడపడానికి అవసరమైన నిధుల కోసం రోల్స్ రాయిస్ కారును విజయ్ అమ్ముతున్నట్టు సామాజిక మాద్యమాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story