తమిళనాడు సీఎం ట్రోఫి: థీమ్ సాంగ్‌‌కు పనిచేయడం గౌరవంగా ఉంది

by Disha Web Desk 10 |
తమిళనాడు సీఎం ట్రోఫి: థీమ్ సాంగ్‌‌కు పనిచేయడం గౌరవంగా ఉంది
X

దిశ, సినిమా : తమిళనాడు సీఎం ట్రోఫి థీమ్ సాంగ్‌కు సంగీతం అందించే అవకాశం రావడంపై తమన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ‘#కలాంనామదే’ అనే పేరుతో వివేక్ సాహిత్యం అందించిన ఎమోషనల్ సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా, గౌరవంగా ఉంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఒక గొప్ప అవకాశం కల్పించిన మా ప్రియమైన మంత్రి, అన్న ఉదయనిధి స్టాలిన్.. గౌరవనీయ ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు. నా ప్రియమైన సోదరుడు లిరిసిస్ట్ వివేక్, అరుణ్‌రాజా కామరాజ్, జే మేఘనాథరెడ్డికి బిగ్ థాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. అరుణ్‌రాజా కామరాజ్ దర్శకత్వం వహించిన ఈ పాటలో చూపించిన ఆటగాళ్లు సాధించిన పతకాలు, తల్లిదండ్రుల భావోద్వేగాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Also Read..

నటి లగేజ్‌లో ఎండుమిర్చి, అల్లం.. దాన్ని కంట్రోల్ చేసుకునేందుకేనట

Next Story

Most Viewed