తమిళ్ లో రికార్డులు క్రియేట్ చేసిన Mamannan.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..

by Dishanational2 |
తమిళ్ లో రికార్డులు క్రియేట్ చేసిన Mamannan.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..
X

దిశ, సినిమా: ఉద‌య‌నిధి స్టాలిన్‌, వడివేలు, ఫ‌హాద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ త‌మిళ్ మూవీ ‘మామ‌న్న‌న్’. జూన్ 29న త‌మిళ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 40 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. దీంతో తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు తెలుగు వెర్ష‌న్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘మామ‌న్న‌న్’ తెలుగు వెర్ష‌న్‌కు ‘నాయ‌కుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా జూలై 14న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కోలివుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

Read More: అరవింద స్వామికి అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..?

Next Story

Most Viewed