- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ నటిపై ప్రియుడి దాడి.. దారుణంగా కొట్టాడంటూ ఫొటోలు పోస్ట్
సినిమా ఇండస్ట్రీలో లవ్, లివిన్ రిలేషన్ షిప్, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ కామన్. అయితే కొందరి మధ్య ఆ బంధం సాఫీగా సాగినప్పటికీ, కొందరు మాత్రం తీవ్రమైన సంఘటనలను ఎదుర్కుంటారు..

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో లవ్, లివిన్ రిలేషన్ షిప్, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ కామన్. అయితే కొందరి మధ్య ఆ బంధం సాఫీగా సాగినప్పటికీ, కొందరు మాత్రం తీవ్రమైన సంఘటనలను ఎదుర్కుంటారు. తమిళ నటి అనికా కూడా ఎక్స్‌తో అలాంటి అనుభవాలే ఎదుర్కొన్నట్లు తెలుపుతూ.. ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంటూ, నోట్ షేర్ చెసింది. ‘నేను గతంలో అనూప్ పిల్లై అనే వ్యక్తిని లవ్ చేశాను.
అతను నన్ను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఓర్చుకున్నా కానీ అతడిలో ఏ మార్పు రాలేదు. ఇంకా వేధిస్తూనే ఉన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అది కూడా నన్ను తను రెండోసారి కొట్టినప్పుడు. ఎందుకంటే మొదటి సారి కొట్టినప్పుడు పోలీసులకు చెప్పకు అంటూ, అతను నా కాళ్లపై పడి బతిమాలాడు. తర్వాత అతను డబ్బులిచ్చి పోలీసులను కూడా కొన్నాడు. వారి అండ చూసుకొని.. తరచూ కొడుతూ ఉండేవాడు. ఇక ఏదేమైనప్పటికీ ఇది నా గతం. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. షూటింగ్‌లకు హాజరవుతున్నాను’ అని చెప్పుకొచ్చింది అనిక.
- Tags
- Anika
- viral pics






