- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకుని పిల్లలను కంటా అనుకున్నా.. కానీ వృద్ధాప్యం చాలా అద్భుతమైనదంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్
వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఐటమ్ సాంగ్స్‌తోనూ సెన్సెషన్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దిశ, సినిమా: వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఐటమ్ సాంగ్స్‌తోనూ సెన్సెషన్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 35 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా.. ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా 30 ఏళ్ల వయసులో ఉన్న హీరోయిన్లను సినీ ఇండస్ట్రీలో ఎలా చూస్తారనే విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సినీ ఇండ్రస్టీలో 30 ఏళ్లు దాటిన హీరోయిన్లను చూసే మనస్తత్వం మారింది.
ఈ వయస్సు వర్గానికి చెందిన మహిళల కోసం ఇప్పుడు మరిన్ని పాత్రలు రాస్తున్నారు. గతంలో ఆ వయస్సు దాటిన తర్వాత హీరోయిన్లను అంతగా చూపించే వారు కాదు. నిజానికి నేను నటిగా మారినప్పుడు పదేళ్ల ప్లాన్ ఉండేది. ముప్పైలలోకి వచ్చే వరకు పని చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలను కంటానని అనుకున్నాను. కానీ అలా చేయలేదు. మంచి విషయం ఏమిటంటే, నేను పని చేస్తున్నప్పుడు నా ఇరవైల చివరలో ఉన్నప్పుడు నేను నిజంగా నా సొంత వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాను.
అప్పటికే, అదృష్టవశాత్తూ పరిశ్రమ శక్తివంతమైన పాత్రలను రాయడం ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక సాధారణ మార్పు అని నేను అనుకుంటున్నా. చాలా మందికి వయస్సుపై ఈ భయం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది వృద్ధాప్యం ఒక వ్యాధి అయినట్లు మాట్లాడుతారు. నా దృష్టిలో వృద్ధాప్యం చాలా అద్భుతమైనది’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికీ తమన్నా పెళ్లి చేసుకోదన్న సంగతి తెలుసుకుని త్వరగా చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.






