ఆ సినిమాలో సత్యదేవ్‌ను నేనే సెట్ చేశా: Tamannaah

by Disha Web Desk 6 |
ఆ సినిమాలో సత్యదేవ్‌ను నేనే సెట్ చేశా: Tamannaah
X

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలవుతోంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అడివి శేష్ గెస్ట్‌గా వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తమన్నా మాట్లాడుతూ 'ఇప్పటి వరకూ నాకు శీతాకాలం అంటే ఇష్టం లేదు. వేసవి కాలమంటేనే ఇష్టం. కానీ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత శీతాకాలంపై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ టీమ్ మొత్తం నన్ను చూసి ఎందుకు భయపడుతుంది. నేను చాలా నైస్ పర్సన్. ఎవరినీ భయపెట్టను. హీరో సత్యదేవ్‌తో సినిమా చేయాలని ముందునుండే అనుకున్నా. లక్కీగా నాకు ఆఫర్ వచ్చింది. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. సత్యదేవ్ ఈ సినిమాలో ఉండేలా సెట్ చేసింది నేనే' అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: నా హృదయంలో అమ్మాయి ప్రేమకు స్థానం ఉంది: Kartik


Next Story

Most Viewed