ఇలాంటి క్యారెక్టర్‌కు తమన్నానే కరెక్ట్‌.. అదరగొట్టేసిందంటున్న ప్రియుడు

by samatah |   (  Updated:2023-06-22 07:42:39  IST  )

బోల్డ్ బ్యూటీ తమన్నా పనితీరుపై ఆమె ప్రియుడు, నటుడు విజయ్ వర్మ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్.. తమ రిలేషన్ అండ్ వర్క్ గురించి ఓ

ఇలాంటి క్యారెక్టర్‌కు తమన్నానే కరెక్ట్‌.. అదరగొట్టేసిందంటున్న ప్రియుడు
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ తమన్నా పనితీరుపై ఆమె ప్రియుడు, నటుడు విజయ్ వర్మ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న విజయ్.. తమ రిలేషన్ అండ్ వర్క్ గురించి ఓపెన్ అయ్యాడు. ‘ఈ మూవీ స్ర్కిప్ట్ చదవగానే హీరోయిన్ ఎవరని అడిగాను. తమన్నా పేరు చెప్పగానే ఫర్‌ఫెక్ట్ సెలక్షన్ అనిపించింది. ఈ క్యారెక్టర్‌కు ఆమె కరెక్ట్‌గా సరిపోయింది. సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది. పాత్రలోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి శ్రద్ధగా పనిచేసింది. ఇది ఆమె మాత్రమే చేయగలదు అనుకునేలా అట్రాక్ట్ చేసింది. నిజంగా తమన్నా ఒక ఐకాన్. ‘బాహుబలి’, ‘బబ్లీ బౌన్స్‌ర్’లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా. ఇందులో తన నటన చూసినవాళ్లంతా ప్రశంసించకుండా ఉండలేరు’ అంటూ తనదైన స్టైల్‌లో నటిని పొగిడేశాడు.

Next Story