హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు రేపుతోన్న మిల్కీ బ్యూటీ తమన్నా

by Disha Web Desk 10 |
హాట్ ఫోటోషూట్‌తో సెగ‌లు రేపుతోన్న మిల్కీ బ్యూటీ తమన్నా
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నాకు ఇప్పటికీ కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆమె సరయిన కథ ఎంచుకోలేకపోతుంది. బాహుబలి తరువాత తమన్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ సినిమా తర్వాత పైగా మరింత కిందకు వెళ్లినట్టుగా అనిపించింది. తమన్నాకు ఇంత వరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదు.

తమన్నాకు ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉండేది. స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బన్నీతో కలిసి తమన్నా నటించింది. ఆమె కెరీర్‌లో హిట్‌ల కంటే ఫ్లాపులే ఎక్కువ. అయితే తన అందం, పర్సనల్ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది.

ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచి హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం స్పీడ్ తగ్గించి బాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఆమె అభిమానులకి ట్రీట్ ఇస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Read More..

మరోసారి వేశ్యగా అనుష్క శెట్టి వేదంను మించిన సీన్స్.. తన సినీ కెరీర్ నాశనం కానుందా?

Next Story