అలియాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న తమన్నా మాజీ ప్రియుడు.. మాములోడు కాదంటూ నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-23 04:47:44  IST  )

విజయ్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా ఖురేషితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ‘జవాన్’ సినిమాలో తన నటనతో మెప్పించిన అలియా, విజయ్ వర్మ నటిస్తున్న ‘మట్కా కింగ్’ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

అలియాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న తమన్నా మాజీ ప్రియుడు.. మాములోడు కాదంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, విజయ్ వర్మల బంధం ముగిసిందన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంతటి సందడి చేశాయో మనందరికీ తెలిసిందే. ఒకానొక దశలో వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అందరూ భావించారు. కానీ, గత కొంతకాలంగా వీరి మధ్య దూరం పెరగడం, సోషల్ మీడియాలో ఒకరి గురించి మరొకరు పోస్ట్‌లు పెట్టకపోవడంతో బ్రేకప్ వార్తలు నిజమేనని అర్థమవుతోంది. తమన్నా తన కెరీర్‌ను కాపాడుకోవడానికి సినిమాలపై దృష్టి పెడుతుంటే, విజయ్ వర్మ మాత్రం మరో నటితో క్లోజ్‌గా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. విజయ్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా ఖురేషితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ‘జవాన్’ సినిమాలో తన నటనతో మెప్పించిన అలియా, విజయ్ వర్మ నటిస్తున్న ‘మట్కా కింగ్’ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో తిరుగుతూ డిన్నర్ డేట్‌లకు వెళ్తుండటంతో వీరి రిలేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ కారులో సన్నిహితంగా కూర్చుని వెళ్తున్న వీడియో బయటకు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు విజయ్ వర్మ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమన్నా లాంటి పెద్ద నటితో రిలేషన్ పెట్టుకుని, ఆమెను వాడుకుని ఇప్పుడు మరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. బ్రేకప్ జరిగిన కొద్ది రోజుల్లోనే మరో రిలేషన్ ఎలా పెట్టుకోగలిగావు? అని విజయ్ వర్మను ప్రశ్నిస్తున్నారు. విజయ్ వర్మకు ప్రేమంటే కేవలం కాలక్షేపమేనా? అని తమన్నా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మొత్తానికి, తమన్నా తన పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ చేదు అనుభవం నుంచి బయటపడి సినిమాలతో బిజీ అవుతుంటే, విజయ్ వర్మ మాత్రం తన కొత్త ప్రేమతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఏ దేవాలయానికి వెళ్లినా మాపై ట్రోలింగ్ చేస్తున్నారు !

Next Story