పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లపై Tamannaah షాకింగ్ కామెంట్స్..!

by Disha Web Desk 9 |
పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లపై Tamannaah షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరించడంలో బిజీ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’, రజినీకాంత్‌తో ‘జైలర్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాగా భోళాశంకర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నాను హైపర్ ఆది తాజాగా ఇంటర్వ్యూ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి వర్క్ చేశారు కదా? వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారని తమన్నాను ప్రశ్నించాడు ఆది. ముందుగా చిరంజీవి గురించి చెబుతూ..‘ఆయన యూనిక్ స్టార్. ఆయన్ని ప్రేమించని వారంటూ ఉండరు. ఇక పవర్ స్టార్- వెరీ మాస్ అండ్ స్టైలిష్ పర్సన్. ప్రభాస్ ప్రతిఒక్కరికి డార్లింగ్. మహేష్ బాబు - గుడ్ లుకింగ్, గ్లామర్ హీరో. జూనియర్ ఎన్టీఆర్- ఆల్ రౌండర్. డాన్స్, ఫైట్స్ బాగా చేస్తారు. అలాగే అల్లు అర్జున్- స్టైలిస్ స్టర్, మంచి డాన్సర్. తెలుగులోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా. రామ్ చరణ్- లాయల్ పర్సన్.’’ అంటూ మిల్స్ బ్యూటీ ఇలా టాప్ హీరోల గురించి సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి Tamannaah Bhatia: ఎగిసి పడుతున్న తమన్నా హాట్ అందాలు....రెచ్చిపోయిన తమన్నా భాటియా



Next Story

Most Viewed