ఇండస్ట్రీలో దూసుకుపోతున్న క్రమంలో అలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్న తమన్న.. (వీడియో)

by Disha Web Desk 6 |
ఇండస్ట్రీలో దూసుకుపోతున్న క్రమంలో అలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్న తమన్న.. (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనే యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. తాజాగా, తమన్న తన ఇన్‌గ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బ్యాన్ చేసిన ‘‘లోటస్ 365’’ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ యాప్‌లో ప్రభుత్వం 2023లో డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లపై మొత్తం 581 యాప్‌లను బ్యాన్ చేసింది. వీటిలో 174 బెట్టింగ్, జూదానికి సంబంధించినవి కాగా, 87 రుణాలు ఇవ్వడానికి సంబంధించినవి ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మహాదేవ్ యాప్‌లతో సహా 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఈ క్రమంలో తమన్న బ్యాన్ చేసిన యాప్‌ను ప్రమోట్ చేసి చిక్కుల్లో పడింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ప్రభుత్వం తమన్నపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Next Story

Most Viewed