బాలీవుడ్ హీరోలకు బౌన్సర్‌గా పనిచేయాలనుంది: Tamannah Bhatia

by Hajipasha |   (  Updated:2022-09-05 11:57:50  IST  )

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా నటించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'.Latest Telugu News

బాలీవుడ్ హీరోలకు బౌన్సర్‌గా పనిచేయాలనుంది: Tamannah Bhatia
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా నటించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన తమన్నా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు బాగా ఇష్టమైన హృతిక్ రోషన్, విక్కీ కౌశల్‌కు ఒకరోజు బౌన్సర్‌గా పనిచేయాలనుందని ఆసక్తికరంగా మాట్లాడింది.

అలాగే తనను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారన్న నటి.. నిజ జీవితంలో చోటుచేసుకునే హాస్యం, బాధల అనుభూతిని కలిగించే ఈ కథ అందరినీ మెప్పిస్తుందని చెప్పింది. ఇక సెప్టెంబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో హిందీ, తమిళం, తెలుగులో విడుదల కానుండగా ఈ చిత్రంలో తమన్నా తోపాటు సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ స్టూడియోస్ అండ్ జంగ్లీ పిక్చర్స్ నిర్మించిన మూవీకి అమిత్ జోషి, ఆరాధనా దేబ్‌నాథ్, మధుర్ భండార్కర్ కాన్సెప్ట్, కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Also Read : బాలీవుడ్‌కు భారతదేశ సమస్యలు కనిపించట్లేదు: పల్లవి జోషి

Next Story