Tollywood : అసలైన కింగ్ అతనొక్కడే: స్టార్ హీరోపై తమన్న ప్రశంసలు

by Disha Web Desk 10 |
Tollywood : అసలైన కింగ్ అతనొక్కడే: స్టార్ హీరోపై తమన్న ప్రశంసలు
X

దిశ, సినిమా : అతిథులకు ఆతిథ్యమివ్వడంలో ప్రభాస్‌ను మించినవారు లేరంటోంది తమన్నా. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె ఇటీవల డార్లింగ్ ఇంటికి ఆతిథ్యానికి వెళ్లి ఫిదా అయ్యానంటూ పొగిడేసింది. 'ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. అయితే ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. తన ఇంటికి వచ్చిన గెస్టులను కూడా ఎంత మర్యాదగా చూసుకుంటాడో దేశమంతా తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే దాదాపు 30 రకాల వంటలుండాల్సిందే. ఖర్చు గురించి అస్సలు ఆలోచించడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్‌ను చూస్తే ఒక రాజు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. అతను పెద్దస్టార్‌ అయినప్పటికీ సాధారణ మనిషిలా ఉండటాన్ని చాలామంది ఇష్టపడతారు. అందుకే లెక్కలేనంత మంది అభిమానులను సొంతం చేసుకోగలిగాడు' అంటూ తనదైన స్టైల్‌లో ప్రశంసలు కురిపించింది.



Next Story

Most Viewed