విశ్వక్ దర్శకత్వం ఆపేయ్.. తారక్ కామెంట్స్ వైరల్

by Disha Web |
విశ్వక్ దర్శకత్వం ఆపేయ్.. తారక్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. మార్చి 22న రిలీజ్ కాబోతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తారక్ తనదైన స్టైల్‌లో మాట్లాడుతూ అభిమానులను అలరించాడు. ‘విశ్వక్ ఒక ఎనర్జీ బాల్. నేను మూడ్ ఆఫ్ అయినప్పుడు కొన్ని చిత్రాలు చూస్తాను అందులో విశ్వక్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. ఆ తర్వాత విశ్వక్ దర్శకత్వం వహించిన ‘ఫలక్‌నామా దాస్’. విశ్వక్ హీరోగా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో.. డైరెక్టర్‌గా కూడా అంతే నమ్మకంతో ముందుకెళతాడు. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సందర్భంగా విశ్వకు నువ్వు దర్శకత్వం ఆపేయాలి. మనకు బోలెడంత మంది దర్శకులున్నారు. కొత్త వారికి నీలాంటి మంచి నటులు అవకాశాలివ్వాలి’ అన్నాడు. అలాగే ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టానని విశ్వక్ చెప్పడం చాలా బాధేసిందన్న తారక్.. ఉగాదికి రిలీజ్ కాబోతున్న సినిమాతో తన జీవితంలో అన్నీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Also Read..

‘మగధీర’ రీ రిలీజ్‌.. మరో అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్Next Story