సంతోష్ శోభన్‌లో ‘నన్ను నేను చూసుకున్నా’నంటున్న నాని !

by Disha Web Desk 10 |
సంతోష్ శోభన్‌లో ‘నన్ను నేను చూసుకున్నా’నంటున్న నాని !
X

దిశ, సినిమా: సంతోష్ శోభన్ హీరోగా, నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మే 18న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలకు న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘ఈ వేడుకకు ఒక ఫ్యామిలీ మెంబర్‌గా వచ్చాను. ఈవెంట్‌కి పిలుస్తూ నా పోస్టర్ వేయాల్సిన పనిలేదు. అలాంటి అనౌన్స్‌మెంట్ చేయకపోయినా నేను తప్పకుండా వస్తా. ‘అలా మొదలైంది’ సినిమాతో తన కెరీర్ మొదలైంది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ చూస్తుంటే నందిని రెడ్డి మెచ్యురిటీ పెరిగిందనిపిస్తోంది. సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూసుకుంటున్న.. ఆమెకు మరో నాని దొరికేసినట్టే’ అన్నారు.

Read More: Hero Ram: నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు

నా భర్తను ఎప్పటికీ వదలను.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story