ఆ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి.. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ.. మొదటి ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి.

ఆ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి.. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ.. మొదటి ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి. రీరిలీజ్‌లో స్టార్ హీరోల సినిమాలు పుంజుకుంటూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయినవి కూడా మరోసారి మ్యాజిక్ చేస్తు్న్నాయి. త్వరలోనే అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ నవంబర్ 14న థియేటర్స్‌లోకి రానుంది. శివ విడుదలైన రోజులను అందరూ గుర్తు చేసుకుంటూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు నాగార్జున కోసం స్పెషల్ వీడియోలు చేశారు. ఇక ఇప్పుడు.. ‘శివ’రీరిలీజ్‌పై ఐకాన్ అల్లు అర్జున్(allu arjun) స్పందించారు.

అలాగే ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’(shiva) ఒక ఐకానిక్ చిత్రంలాంటిది. ఆ ఒక్క మూవీ భారతీయ సినీ పరిశ్రమకు కొత్త దారులు చూపింది. మాస్ రియలిజం, టెక్నికల్ బ్రిలియన్స్ అన్ని కలిపిన ఒక అద్భుతం ‘శివ’. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే ఆ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలి. అందుకే అక్కినేని అభిమానులకే కాకుండా తెలుగు మూవీ ప్రియులకు ఇది సెలబ్రేషన్ లాంటిది. ఈ సారి థియేటర్స్‌కు వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి’’ అని తనదైన స్టైల్లో చెప్పారు. ఇక ఈ వీడియోపై నాగార్జున సైతం స్పందించిన ధన్యవాదాలు తెలిపారు.

link

Next Story