- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన పాత్ర ఇది.. 'దృశ్యం 2'పై టబు
సీనియర్ నటి టబు, శ్రియ, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దృశ్యం 2'.

దిశ, సినిమా : సీనియర్ నటి టబు, శ్రియ, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దృశ్యం 2'. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సినిమాలో గోవా 'IG' మీరా ఎమ్. దేశ్‌ముఖ్ పాత్ర పోషించిన టబు ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో చేసిన అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఇదొకటని చెప్పింది.
అలాగే ఈ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్‌గా ఉందన్న ఆమె.. ఈ పాత్రను రాసిన రచయితకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలని, ఇలాంటి సంక్షిష్టమైన పాత్రను రాయడం అనుకున్నంత సులభం కాదని తెలిపింది. ఇక వయాకామ్ 18 స్టూడియోస్, గుల్షన్ కుమార్, టి-సిరీస్, పనోరమా స్టూడియోస్ మద్దతుతో భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం 2022 నవంబర్ 18న విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి :
ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది.. సరైన టైమ్ రావాలి






