నాగార్జునతో మ‌రోసారి 53 ఏళ్ల అందాల తార ?

by velandi.Saikiran |

అక్కినేని నాగార్జున కొడుకులతో పాటు పాత హీరోయిన్ టబు కూడా ఉంటున్నారట. అ

నాగార్జునతో మ‌రోసారి 53 ఏళ్ల అందాల తార ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన నాగార్జున తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కొడుకులు ఇద్దరు హీరోలు అయినప్పటికీ కూడా, ఎవర్ గ్రీన్ హీరోగా నాగార్జున కొనసాగుతున్నారు. ఏజ్ పైబడినట్లు ఎక్కడా కూడా నాగార్జున కనిపించరు. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఉంటారు.

అలాంటి నాగార్జున తన 100వ‌ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇతడు తమిళంలో ఓ సినిమా చేశాడు. ఇక మే 2026 లో నాగార్జున 100వ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ ఈ సినిమా నుంచి వచ్చింది.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కొడుకులతో పాటు పాత హీరోయిన్ టబు కూడా ఉంటున్నారట. అయితే ఇందులో ఆమె హీరోయిన్ గా చేస్తారా? లేదా ఇతర పాత్రలో కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆమె మాత్రం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున అలాగే టబు కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి.

Next Story