రాత్రి కాగానే, ఆ పని చేయాల్సిందే... 53 ఏళ్ళ భామ షాకింగ్ కామెంట్స్!

by Veldandi saikiran |   ( Updated:2025-04-19 17:43:28.0  )
రాత్రి కాగానే, ఆ పని చేయాల్సిందే... 53 ఏళ్ళ భామ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. సీనియర్ హీరోయిన్ టబు ( Tabu) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరోయిన్ టబు అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. హైదరాబాద్ ( Hyderabad) మహానగరంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ముంబైలోనే స్థిరపడింది. కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ... ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది.

ముఖ్యంగా నాగార్జునతో ( akkineni Nagarjuna) ఎక్కువ సినిమాలు చేసి... చాలా రూమర్స్ తనపై వేసుకుంది. నాగార్జున అలాగే టబు మధ్య... ఏదో రిలేషన్ ఉందని చాలా మంది రకరకాలుగా వార్తలు వైరల్ చేశారు. టబును అక్కినేని నాగార్జున రెండో పెళ్లి చేసుకుంటాడని కూడా అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొంతమందితో టబు రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే 53 సంవత్సరాలు వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ కూడా చేసేసింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన... అలా వైకుంటపురం సినిమాలో... తల్లి పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది. అలాంటి హీరోయిన్ టబుకు ఓ చెడ్డ అలవాటు ఉందని సమాచారం అందుతోంది. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ఒక స్ట్రాంగ్ కాఫీ.... తాగుతుందట నటి టబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినా కూడా... తనకు నచ్చిన ఓ ప్రముఖ కాఫీ బ్రాండ్.. పొడి మాత్రం తన వెంట తీసుకువెళ్తారట. ఆ కాఫీని మాత్రమే తాగుతారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది.



Next Story

Most Viewed