53 ఏళ్ల భామ‌తో అక్కినేని హీరో సినిమా ?

by velandi.Saikiran |   (  Updated:2025-09-18 15:39:03  IST  )

నాగార్జున అలాగే టబు కాంబినేషన్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమెకు నాగార్జున 100వ సినిమాలో

53 ఏళ్ల భామ‌తో అక్కినేని హీరో సినిమా ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కుటుంబానికి ఉన్న పాపులారిటీ అంతా కాదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలోకి వచ్చారు నాగార్జున. ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున.... కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున కొడుకులు ఇద్దరు... అఖిల్ అలాగే నాగచైతన్య ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అయితే... వరుసగా సినిమాలు చేస్తున్న అక్కినేని నాగార్జున 100వ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తన కొడుకులు ఇద్దరు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ కాబోతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ టబు కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 53 ఏళ్ల టబు గతంలో నాగార్జునతో కూడా సినిమాలు చేశారు. అప్పట్లో వీరి మధ్య చాలా నచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. నాగార్జున అలాగే టబు కాంబినేషన్ లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమెకు నాగార్జున 100వ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చిందట.

Next Story