Taapsee pannu :నా ఏకైక లక్ష్యం అదే.. ఆ ఇమేజ్ కోసమే ఆరాటపడుతున్నా

by Disha Web Desk 10 |
Taapsee pannu :నా ఏకైక లక్ష్యం అదే.. ఆ ఇమేజ్ కోసమే ఆరాటపడుతున్నా
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తనకు దక్కిన ఇమేజ్ గురించి తాప్సీ పన్ను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు బీటౌన్‌లో తను చేసిన పని పట్ల సంతృప్తిగా ఉన్నానన్న ఆమె.. సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు కేవలం గ్లామర్ పాత్రలతోనే సరిపెట్టుకోకుండా ఇంకేదైనా కొత్తగా చేయాలని కోరుకున్నట్లు తెలిపింది. ‘నా ఏకైక లక్ష్యం ఒకటే.. నన్ను ఎవరు సులభంగా మార్చలేని వ్యక్తిగా ఎదగటం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడం. దక్షిణాదిలో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా తమ ప్రాజెక్ట్ నుంచి తప్పించగలరని గ్రహించాను. అందుకే నా కోసం ప్రేక్షకులు వెచ్చించే సమయం, డబ్బును వృధా కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Also Read.:. బికినీ ధరించేందుకు రెడీ అయిన కృతి శెట్టి.. అభిమానులు అంగీకరిస్తారా?



Next Story