కంగనతో ఎలాంటి సమస్య లేదు.. ఆమె కోరికలే ‘చీప్’

by Disha Web Desk 7 |
కంగనతో ఎలాంటి సమస్య లేదు.. ఆమె కోరికలే ‘చీప్’
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సహ నటి తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్ చేసింది.నిజానికి కంగనతో తనకు ఎలాంటి సమస్య లేదంటూనే స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ‘ఆమె ఎప్పుడు ఎదురైనా పలకరించడానికి వెనుకాడను. కంగనా సోదరి రంగోలి చందేల్ నన్ను ‘బి-గ్రేడ్’ అంటే.. కంగన కూడా ‘చీప్’ అని పిలిచింది. అయినా దాని గురించి నేనేం బాధపడలేదు. నిజం చెప్పాలంటే వాటి అర్థాలు నాకు తెలియదు. నేను ఇప్పుడు పరిశ్రమలో ఉన్నాను కాబట్టి అతిథులను పలకరించడం, హలో, ధన్యవాదాలు చెప్పడం కామన్‌గా తీసుకుంటా. ఆమె కనిపిస్తే దూరంగా వెళ్లను. ఎందుకంటే నాకు ఆమెతో సమస్య లేదు. కానీ, ఆమెనే ఒక సమస్యగా మారింది. ఆమె కోరికలు చూసి మొదట ఆశ్చర్యపోయాను. నన్ను చౌక అని పిలిచినప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. ఎందుకుంటే ఆమె గొప్ప నటి. అందుకే దాన్ని ఒక అభినందనగా తీసుకున్నా’ అని తాప్సీ వివరించింది.

ఇవి కూడా చదవండి:

భారతీయ మహిళలు సోమరిపోతులే.. ఆ ధైర్యం లేదు

Next Story

Most Viewed